»Warangal Mgm College Pg Medical Student Preethi Suicide Attempt
Warangal MGM: సీనియర్ వేధింపులు..వైద్య విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్..పరిస్థితి విషమం!
ఓ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వేధింపుల అంశంపై కాలేజ్ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని..అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ ఎంజీఎం(warangal mgm) ఆస్పత్రిలో బుధవారం ఓ పీజీ విద్యార్థి(pg medical student)ని సీనియర్ వేధింపులు(harassment by senior)తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోవైపు వేధింపుల గురించి కాలేజ్, ఆస్పత్రి అధికారులకు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు(parents) అంటున్నారు. ఇంకోవైపు వేధింపులు వాస్తవం కాదని అధికారులు చెబుతున్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో ధరావత్ ప్రీతి అనే ఈ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ క్రమంలో ఓ సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్(saif) కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నాడని ఆమె పేరెంట్స్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ విషయం తనకు తెలిపిందని ఆమె పేరెంట్స్ చెప్పారు. దీంతో ఇదే అంశంపై మట్టెవాడ పోలీసుల(police)కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత ప్రిన్సిపల్(principal) ఇతర డాక్టర్ల సమక్షంలో సైఫ్ ను మందలించారని గుర్తు చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ సైఫ్ మంగళవారం రాత్రి కూడా వేధించినట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో ప్రీతి బుధవారం ఉదయం హనికరమైన ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత గుర్తించిన అధికారులు ఆమెను ఐసీయూ(ICU) వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి తీవ్రం కావడంతో హైదరాబాద్(hyderabad) నిమ్స్(NIMS) ఆస్పత్రికి తరలించారు.
జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ ఆర్పీఎఫ్ ఏస్సైగా పనిచేస్తున్నారు. అతనికి ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండగా..చిన్న కుమార్తె ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో డాక్టర్ విద్యనభ్యసిస్తుంది.
మరోవైపు ఈ విషయం కాలేజ్ ప్రిన్సి పల్ కు చెప్పినా కూడా పట్టించుకోలేదని నరేందర్ అంటున్నారు. ఆ తర్వాత పోలీసులకు చెబితే అలా ఎందుకు చేశారని ప్రిన్సిపల్ ప్రశ్నించారని పేర్కొన్నారు. ఇంకోవైపు సైఫ్ వేధింపులు ఆపకపోవడంతోపాటు తన కూమార్తెకు పని గంటలు కూడా పెంచారని వెల్లడించారు. రోగుల దగ్గరే సైఫ్ దూషించేవాడని చెప్పాడు. ఈ ఘటనకు భాధ్యులైన అధికారులపై(officers) చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి కోరుతున్నారు.