»Instead Of Creating Problems For Me Focus On Common Mans Issues Nara Lokesh
Nara Lokesh: నాపై రాళ్ల దాడికి సిద్ధమయ్యారు, బాబు ఒక్క చిటికేస్తే.. వైసీపీకి వార్నింగ్
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు.
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు. యువ గళం (Yuva Galam) భాగంగా ఆయన 24వ రోజు పాదయాత్ర ఏర్పేడు మండలంలో కొనసాగింది. శ్రీకాళహస్తి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. జగన్ (YS Jagan) బీహార్ (bihar) రాజకీయాలను ఆంధ్ర ప్రదేశ్ కు (Andhra Pradesh) తీసుకు వచ్చారని విమర్శించారు. ప్రజల కోసం పోరాడేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే (Attack on Telugudesam Party office) కేసులు లేవని, కానీ తన పాదయాత్ర సందర్భంగా ఓ ఇరవై మంది వ్యక్తులు తన పైన రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నా వారి పైన మాత్రం కేసులు లేవని మండిపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చిటికె వేస్తే తాము వైసీపీ వాళ్ల సంగతి చూసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారిని ఇప్పుడే కట్ డ్రాయర్ పైన ఊరేగిస్తామన్నారు. తమ ఓర్పును, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఓ సమయంలో ఆయన మాట్లాడుతుండగా పోలీసులు ఆపేసే ప్రయత్నం చేయగా… తాను సరిగ్గానే మాట్లాడుతున్నానని, మీరు కేసు పెట్టుకోవచ్చునని లోకేష్ వారికి సూచించారు. ఓ సమయంలో పోలీసుల చర్యతో విసిగిపోయిన లోకేష్… ఓర్పు, సహనం పరీక్షించవద్దని చెబుతూ.. మీసం మెలేసి, తొడకొట్టారు. వచ్చేసారి టీడీపీయే గెలుస్తుందని, పోలీసులకు పోస్టింగ్ ఇచ్చేది కూడా తానే అని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారన్నారు.
శ్రీకాళహస్తిలోని బడా చోర్ సంగతి అంతా తనకు తెలుసునని, చట్టాలు కొంతమంది చుట్టాలు అవుతున్నాయని మండిపడ్డారు. బడా చోర్ ఏమేమి దోపిడీ చేస్తున్నాడో తెలుసునని, చరిత్రను బయటకు లాగుతానని హెచ్చరించారు. అన్నిటి పైనా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తే కేసు ఉండదు కానీ తాను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు పెడతారా.. ఇదేం న్యాయమని పోలీసులను ప్రశ్నించారు. జగన్ వికృత చేష్టలకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. పోలీసులు అత్యాచారాలు, హత్యలు చేసేవారిని అడ్డుకోకుండా తమను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారన్నారు. టీడీపీ ప్రవేశ పెట్టిన 120 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం, ప్రజలు బాగుండాలంటే సైకో పోవాలి… సైకిల్ రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బాధలు పోతాయన్నారు.
ఇదిలా ఉండగా, ఏర్పేడు మండలం మర్రిమంద వద్ద స్థానిక పాఠశాలలో ఇరవై మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారని, వారు లోకేష్ పైన రాళ్లు వేయడానికి సిద్ధపడ్డారని, వారిని అక్కడి నుండి పంపించాలని టీడీపీ… పోలీసులను కోరింది. అయితే వారు అక్కడ మాట్లాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర స్కూల్ వద్దకు చేరుకున్నాక పలువురు టీడీపీ కార్యకర్తలు స్కూల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డగించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అక్కడ అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. మనకు వారితో పని లేదని, వెళ్లిపోదామని లోకేష్ చెప్పడంతో పాదయాత్ర ముందుకు సాగింది.