NLG: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేడు నల్లగొండకు రానున్నట్లు బీజేపీ నాయకులు బుధవారం రాత్రి తెలిపారు. నల్లగొండలోని పెద్ద బండలో ఎఫ్ సీఐ బఫర్ స్టోరేజ్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభిస్తారని జిల్లా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.