W.G: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ. లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలుపోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ వెల్లడించారు.