ప్రీతి (Preeti) కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కుమార్ ఆరోపించారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ (Street corner)మీటింగ్ కు సంజయ్ పాల్గోన్నారు. నిందితుడికి మద్దతుగా ప్రభుత్వం ధర్నా చేయిస్తుందని మండిపడ్డారు. ప్రీతి తల్లి తండ్రులకు గర్బశొకం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రీతి (Preeti) కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కుమార్ ఆరోపించారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ (Street corner)మీటింగ్ కు సంజయ్ పాల్గోన్నారు. నిందితుడికి మద్దతుగా ప్రభుత్వం ధర్నా చేయిస్తుందని మండిపడ్డారు. ప్రీతి తల్లి తండ్రులకు గర్బశొకం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జీహాద్
(Love Jihad) వల్లే ఇలా అయిందని నేనంటే ఆమె తండ్రిని బెదిరించారని సంచలన ఆయన వ్యాఖ్యలు చేశారు. సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం వెనక రాజకీయ కోణం ఉందని సంజయ్ (sanjay) అన్నారు.కేటీఆర్ సీఎం కావడాన్ని సాయన్న వ్యతిరేకించడం వల్లే ఆయనను అవమానించారని తెలిపారు. బట్టలూడదీసి బతుకమ్మలాడించిన నిరంకుశ నిజాంకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే సాయన్నకు చేయకపోవడం బాధాకరమన్నారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేలు రాహు, కేతువులుగా మారి… భూ కబ్జాలకు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ (Warangal) ను కేసిఆర్ లండన్ చేస్తానన్నారు ఏమైంది? అంటూ ప్రశ్నించారు.
డబుల్ బెడ్రూం (Double bedroom) ఇళ్లు ఏమయ్యాయ్..? అని ప్రశ్నించారు.తెలంగాణలో సెంటిమెంట్ ను రగిలించి లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్( Double engine) సర్కార్ తోనే అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం నిధులియ్యడం లేదు… అభివ్రుద్ధి చేయడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మిమ్ముల్ని కోరేదొక్కటే ఒక్కసారి వరంగల్ (Warangal) బస్టాండ్ కు వెళ్లి చూడండి అన్నారు. ఆ తరువాత వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి చూడండి, ఎవరు అభివృద్ధి చేశారో మీరే బేరీజు వేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల పురిటగడ్డ కాకతీయ యూనివర్శిటీ (KU)… కనీస వసతుల్లేక విద్యార్థులు అల్లాడుతున్నరు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనయ్… శాంతి భద్రతలు అదుపు తప్పినయ్… ప్రీతి మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో మూర్ఖుడు పెట్టిన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొంతమంది పోలీసులు ర్యాగింగ్ చేసినోడి పక్షాన ఉంటూ ప్రీతికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు. లవ్ జిహాదీ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటే… పోలీసులు (Polices) ప్రీతి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి లవ్ జిహాదీ కాదని చెప్పించే యత్నం చేస్తున్నరు.
ప్రీతి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నా.. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో పిల్లవాడు మరణిస్తే కుక్కలకు మటన్ దొరకకు దాడి చేశాయని మేయర్ చెబుతుండటం సిగ్గు చేటు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు. ఎస్సీ వర్గానికి చెందిన సాయన్న(Sayanna) 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా సేవలో మరణిస్తే దళితుడనే కారణంతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. కేటీఆర్ సీఎం కావాలంటూ జరిగిన సంతకాల సేకరణలో సాయన్న సంతకం పెట్టకపోవడంవల్లే ఆయన భౌతిక కాయానికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదన్నారు. నిజాం మనవడు ఈ దేశపోడు కాదు.. ఎక్కడో ఇస్తాంబుల్ లో చనిపోతే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం సిగ్గు చేటు. తెలంగాణ (Telangana) ఆడబిడ్డలను బట్టలిప్పి బతకమ్మ ఆడించిన నిజాం వారసుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారా? దీనిపై సమాజం స్పందించాలన్నారు. బీఆర్ఎస్ (BRS) ను తన్ని తరిమేయాలంటే బీజేపీతోనే సాధ్యం. రామరాజ్యం బీజేపీతోనే సాధ్యం. పేదవాడికి ఉన్నత అవకాశాలు బీజేపీతోనే సాధ్యం.