»Raise Minimum Age For Class I Admission To Six Centre Tells States Uts
National Education Policy: చిన్నారులకు ఆరేళ్ల తర్వాతే ఒకటో తరగతి
నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)... రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.
నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)… రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేసేందుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సు చేసింది. అయిదేళ్ల పాటు పునాది దశలో అభ్యాస అవకాశాలు కల్పించవలసి ఉంటుంది. అందులో మూడు ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (pre school education), రెండేళ్లు ప్రాథమిక విద్యలో తొలి దశ ఒకటి, రెండో తరగతులు ఉంటాయి. ప్రీస్కూల్ నుండి రెండో తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలి.
అందుకే అంగన్ వాడి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేటు, ఎన్జీవోలు నిర్వహించే ప్రీ-స్కూల్ కేంద్రాల్లో మూడేళ్ల పాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరేళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనలలో సవరణలు చేయాలని సూచించింది. ప్రీస్కూల్ విద్యార్థులకు బోధించే విధంగా ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ లో రెండేళ్ల డిప్లోమా కోర్సును రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా అమల్లోకి తేవాలని పేర్కొంది.