»Annamalai Defends Soundararajans Remark On Tamil Voters
Annamalai: అక్క ఉద్దేశ్యం అదికాదు.. తెలంగాణ గవర్నర్ ‘తమిళ’ వ్యాఖ్యలపై అన్నామలై
తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్క (Tamilisai) ఉద్దేశ్యం అది కాదంటూ ప్రజలకు స్పష్టం చేశారు. తమిళ ప్రజలు నాయకత్వ ప్రతిభ కలిగిన వారిని ఎన్నుకొని, లోకసభకు పంపించాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ మాటలను డీఎంకే, కాంగ్రెస్ టార్గెట్ చేసే ప్రయత్నాలు చేసింది. ప్రతిభ లేని వారిని ఎన్నుకున్నారని చెప్పడం ద్వారా తమిళ ప్రజలను అవమానించారంటూ విపరీతార్థం తీసే ప్రయత్నాలు చేశారు. దీనికి అన్నామలై (Annamalai) కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలకు వివరణ ఇచ్చారు.
‘అక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. తమిళనాడులో సంపూర్ణ విశిష్టత కలిగిన నాయకులు ఉన్నారు. వారిని మనం దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రతిభ కలిగిన వారిని గుర్తించి ప్రధాని (Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి (Amit Shah), రాష్ట్రపతి (droupadi murmu)లు గవర్నర్ గా ఎక్కువ మందిని నియమిస్తున్నారు. తమిళ ప్రజలు కూడా అలాంటి ప్రతిభ కలిగిన వారిని లోకసభకు పంపించాలి’ అనేది తమిళసై ఉద్దేశ్యమని అన్నామలై తెలిపారు.
తెలంగాణ గవర్నర్ ఏమన్నారు?
ఇటీవల కోయంబత్తూరులో తమిళసై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ‘లోకసభకు జరిగే ఎన్నికల్లో తమిళనాడులోని నీతివంతమైన, ప్రతిభావంతులైన నాయకులను గెలిపించడం ద్వారా పార్లమెంటుకు పంపించాలి. అలాంటి వ్యక్తులను గుర్తించాలి.’ అన్నారు. తమిళనాడు నుండి ఎక్కువ మందిని కేంద్రం గవర్నర్ లుగా నియమించడంపై మీడియా ప్రశ్నించింది. దానికి ఆమె పైవిధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ.. తమిళనాడు నుండి ప్రతిభావంతులను గుర్తిస్తూ, కేంద్ర ప్రభుత్వం తమలాంటి వారికి గవర్నర్ లుగా అవకాశం ఇస్తోందని చెప్పారు. లోకసభకు ఎక్కువ మంది ఎన్నికై ఉంటే కేంద్రమంత్రి పదవులు వచ్చేవని చెప్పారు. అందుకే ప్రతిభావంతులను ఎన్నుకోవాలని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ప్రతిభను వృధా చేయవద్దని కేంద్రం గవర్నర్ లుగా నియమిస్తోందని చెప్పారు. మన రాష్ట్రంలోని పరిపాలనా నైపుణ్యత కలిగిన వారిని ప్రజలు గుర్తించాలన్నారు. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై గవర్నర్ హోదాలో వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.
సైనికుడి హత్యపై అన్నామలై డిమాండ్
తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎంకే కౌన్సిలర్ చేతిలో సైనికుడు హత్యకు గురయ్యారని, దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. దేశాన్ని, ప్రజలను రక్షించే సైనికుడిని హత్య చేసినందుకు గాను తాము రాష్ట్రవ్యాప్తంగా వరుసగా నిరసనలు తెలుపుతామన్నారు. తమపై కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికి 84 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారన్నారు. ఆర్మీ జవాన్ ను హత్య చేసినందుకు గాను ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఇదిలా ఉండగా, ఈరోడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మంత్రి ఉదయనిధి మారన్ కుటుంబ మహిళా పెద్దలకు వచ్చే ఐదారు నెలల్లో రూ.1000 ఇస్తామని ప్రకటించారు. అన్నామలై డిమాండ్ నేపథ్యంలో మారన్ ఈ ప్రకటన చేశారని అంటున్నారు.