»Hindenburg Report Effects Adani Group Which Lost Rs 11 Lakh Crore With In One Month
Adani Group: ఒక్క నెలలోపే రూ.11 లక్షల కోట్లు అవుట్..ఆ నివేదికనే కారణమా!
అదానీ గ్రూప్ ఒక్క నెలలోపే రూ.11.65 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ జనవరి 25 తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ జనవరి 24న రూ.19.12 లక్షల కోట్లుగా ఉండగా..ప్రస్తుతం 7.55 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది.
అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్(Hindenburg report) జనవరి 25 తర్వాత అదానీ గ్రూప్(Adani Group) మార్కెట్ విలువ(market value) క్రమంగా తగ్గుతుంది. అంతకు ముందు జనవరి 24న అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.19.12 లక్షల కోట్లుగా ఉండేది. అంతేకాదు గత ఏడాది సెప్టెంబర్ 20న ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్ గరిష్టంగా రూ. 22.93 లక్షల కోట్లను తాకింది. ఈ క్రమంలో ప్రస్తుతం అదానీ గ్రూప్ మొత్తం(total) మార్కెట్ విలువ రూ. 7.55 లక్షల కోట్ల కంటే దిగువకు పడిపోయింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేసినప్పటి నుంచి ఈ అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో ఒక్క నెలలోపు 61% లేదా రూ.11.65 లక్షల కోట్లకుపైగా సంపదను కోల్పోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 100 బిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది.
ఈ క్రమంలో అదానీ పోర్ట్స్(adani ports), అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ సహా అనేక అదానీ గ్రూప్ సంస్థల షేర్లు బుధవారం పడిపోయాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, పన్ను ఎగవేతలను అక్రమంగా ఉపయోగించిందని ఆరోపించింది. మరోవైపు అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మరోవైపు వాటాదారులు, పెట్టుబడిదారులను శాంతపరిచే చర్యలు తీసుకున్నప్పటికీ, దాని లిస్టెడ్ కంపెనీల షేర్ల(share prices)ను ఎత్తివేయలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఒక నెలలోపే అదానీ గ్రూప్ స్టాక్ విలువ(stock value)లో 54 శాతానికి పైగా నష్టపోయిన అదానీ ఎంటర్ప్రైజెస్(adani enterprises) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.79 లక్షల కోట్లుగా ఉంది. దీని స్టాక్ విలువ ఒక్కో షేరుకు రూ.3,435 నుంచి రూ.1,563.90కి పడిపోయింది. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ అదానీ గ్రూప్ సంస్థ ఒక నెలలో దాని స్టాక్ విలువలో 24 శాతానికి పైగా కోల్పోయిన అన్ని ఇతర లిస్టెడ్ సంస్థలలో అతి తక్కువ ప్రభావం చూపిన స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది.