»14 906 Kg Gold Seized Shamshabad Airport Rs 7 Crore Value
Shamshabad Airport:లో రూ.7 కోట్ల గోల్డ్ పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారంను 23 మంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14.906 కేజీల ఆ గోల్డ్ విలువ 7 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు(shamshabad airport)లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారంను అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుడాన్(sudan) దేశం నుంచి వస్తున్న 23 మంది దగ్గరి నుంచి 14.906 కిలోల గోల్డ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ గోల్డ్ విలువ 7 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు(customs officers) వెల్లడించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా పలువురిని సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ పలువురు మాత్రం వింతగా ప్రవర్తించిన క్రమంలో అనుమానం వచ్చిందన్నారు. ఆ క్రమంలో వారి నుంచి పలు రకాల సమాచారం ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని లోతుగా తనిఖీ(checking) చేయగా..అసలు దాందా వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. 23 మంది షూల కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గోల్డ్ అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరోవైపు మిగతావారిని కూడా విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే అసలు వీరంతా ఒకటే గ్యాంగ్ కు చెందిన వారా లేదా వేర్వేరు ప్రాంతాల వారా? అసలు బంగారం ఎక్కడికి తీసుకెళ్తున్నారు సహా పలు వివరాలను(information) అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తామని అధికారులు(officers) స్పష్టం చేశారు.