»Gautam Adani Pramoters Firms Buy Stake In Group Two Company Focus On Share Today
Adani Group: రెండు కంపెనీల్లో వాటా పెంచుకున్న అదానీ గ్రూప్.. స్టాక్ మార్కెట్లో బూమ్?
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ గ్రూప్ తన వాటాను పెంచుకుంది. ఒక నెల కన్నా తక్కువ సమయంలోనే ప్రమోటర్ గ్రూప్ తన వాటాను 67.65 శాతం నుంచి 69.87 శాతానికి పెంచుకుంది. ప్రమోటర్ గ్రూప్ మరో కంపెనీ అదానీ పోర్ట్‌లో తన వాటాను 63.06 శాతం నుండి 65.23 శాతానికి పెంచుకుంది.
Adani Group: అదానీ గ్రూప్ గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసే పనిలో ఉంది. దీని కారణంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్ రెండు కంపెనీలలో తన వాటాను పెంచుకుంది. ప్రమోటర్ గ్రూప్ తన ఫ్లాగ్షిప్ కంపెనీలో తన వాటాను 69.87 శాతం నుండి 71.93 శాతానికి పెంచుకుంది. ఈరోజు ఇన్వెస్టర్లు ఈ షేర్లపై ఓ కన్నేసి ఉంచవచ్చు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ గ్రూప్ తన వాటాను పెంచుకుంది. ఒక నెల కన్నా తక్కువ సమయంలోనే ప్రమోటర్ గ్రూప్ తన వాటాను 67.65 శాతం నుంచి 69.87 శాతానికి పెంచుకుంది. ప్రమోటర్ గ్రూప్ మరో కంపెనీ అదానీ పోర్ట్‌లో తన వాటాను 63.06 శాతం నుండి 65.23 శాతానికి పెంచుకుంది.
ప్రమోటర్ గ్రూప్ సంస్థ రీసర్జెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అదానీ పోర్ట్‌లో 1 శాతం వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. 1.2 శాతం వాటాను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ DMCC తీసుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ విషయానికి వస్తే.. వాటాలను కెంపస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కొనుగోలు చేశాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం.. ఈ వాటాను ఆగస్టు 14 – సెప్టెంబర్ 8 తేదీలలో బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేశారు. ఒక వారం వ్యవధిలో అమెరికన్ ఇన్వెస్టర్ సంస్థ GQG ప్యాటర్న్స్ ద్వారా అదానీ గ్రూప్ సంస్థలలో వాటా పెరిగింది.
గత నెలలో బల్క్ డీల్ ద్వారా GQG అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ)లో తన వాటాను 5.03 శాతానికి పెంచుకుంది. ఇప్పుడు అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీల్లో ఐదింటిలో GQG వాటా ఉంది. GQG ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీలలో రూ.38,700 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ.4,100 కోట్లు, బెయిన్ క్యాపిటల్ రూ.1,440 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.