ED questions Arvind Kejriwal's personal assistant on delhi liquor scam
ED questions Kejriwal’s pa:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ (bibhav kumar) (పీఏ)ను (PA) ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ed) అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పేరు చేర్చిన తర్వాత ఆయన పీఏకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ రోజు విచారణకు పిలిచి, ప్రశ్నిస్తోంది. సమీర్ మహేంద్రు (sameer) అనే మద్యం వ్యాపారి లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు. ఆయన అరవింద్ కేజ్రీవాల్‌తో (Arvind Kejriwal) వీడియో కాల్ మాట్లాడారు. ఆప్ కమ్యునికేషన్ ఇంచార్జీ విజయ్ నాయర్‌ను (vijay nair) విశ్వసించాలని సమీర్‌ను కేజ్రీవాల్ కోరారని ఈడీ చెబుతోంది. సమీర్, విజయ్ ఇతరులతో కలిసి లిక్కర్ స్కాం కుట్ర చేశారని తెలిపింది. దీంతో తమ అనుమానాలకు మరింత బలం చేకూరిందని అంటోంది.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత (kavitha) మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీ రోల్ పోషించాడట. హైదరాబాద్‌కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్స్‌లకు.. ప్రయోజనం పొందిన వారికి అక్రమంగా లాభాలు సమకూరాయని సీబీఐ అంటోంది. కవిత (kavtiha) తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినప్పటి నుంచి బుచ్చిబాబు అడిటర్‌గా ఉన్నారు. మంత్రి కేటీఆర్, సన్నిహిత నేతలకు కూడా అడిటర్‌గా పనిచేశారని తెలిసింది. అంతకుముందు అభిషేక్ బోయినపల్లిని (abhishek) కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి గౌతమ్ మల్హొత్రాను ఈడీ అరస్ట్ చేసింది.
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasula reddy) కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని (raghava reddy) ఇప్పటికే ఈడీ అధికారులు (ed officials) అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్నారు. సౌత్ గ్రూప్‌లో మాగుంట (magunta), కవిత (kavitha) కీ రోల్ పోషించారని ఈడీ అధికారులు సమాచారం సేకరించారు. ఆ మేరకు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ఖాతాకు రూ.100 కోట్లు (100 crores) వెళ్లాయని.. అవీ ఆప్ నేతలకు అందజేశారని ఆరోపనలు వచ్చాయి. అందులో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్యే కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారని తెలిసింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా (amith arora) రిమాండ్ రిపోర్ట్‌లో సౌత్ గ్రూపునకు చెందిన సమాచారాన్ని ఈడీ తెలియజేసింది.