»Punjab Aap Mla Amit Rattan Kotfatta Arrested In Bribery Case
Amit Rattan Kotfatta సర్పంచ్ ఫిర్యాదు.. లంచం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి.
అవినీతి అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party-AAP) ఎమ్మెల్యే అమిత్ రతన్ కోట్ ఫట్టా (Amit Rattan Kotfatta) అరెస్టయ్యారు. ఓ సర్పంచ్ అందించిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన విజిలెన్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలనే అంశంపై తనను లంచం అడిగాడని సర్పంచ్ (Sarpanch) ఆరోపించాడు. ఈ క్రమంలోనే మొదట ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
పంజాబ్ (Punjab)లోని భటిండ గ్రామీణ (Bathinda Rural) ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా అమిత్ రతన్ గెలిచారు. గతంలోనే అతడిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. శిరోమణీ అకాలీ దల్ పార్టీలో ఉన్నాడు. అక్కడ అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ లో చేరి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఈ క్రమంలో ఘడ గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇచ్చే రూ.25 లక్షల గ్రాంట్ విడుదలకు ఎమ్మెల్యే లంచం అడిగారు. మహిళా సర్పంచ్ అయిన ఆమె ఈ విషయం తన భర్తకు తెలిపింది. ఆయన ఎమ్మెల్యే పీఏతో మాట్లాడుకుని అవినీతి నిరోధక అధికారులు (ఏసీబీ)కి సమాచారం అందించాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఎమ్మెల్యే పీఏ రషీమ్ గార్గ్ కు రూ.4 లక్షలు లంచం నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యే లంచం వ్యవహారం బహిర్గతమైంది. అనంతరం పీఏను విచారించిన అధికారులు తాజాగా బుధవారం సాయంత్రం ఎమ్మెల్యేను రాజ్ పూర్ లో అరెస్ట్ చేశారు.
అయితే పీఏ అరెస్ట్ సమయంలో ఎమ్మెల్యే అమిత్ నానా యాగీ చేశాడు. ప్రపతిక్షాలు విమర్శలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నాడు. అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి. అయితే అతడి తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ముఖ్యమంత్రి భగ్ వంత్ మాన్ సింగ్ (Bhagwant Singh Mann) ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భటిండాలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. లంచం కేసులో దోషిగా తేలితే అమిత్ రతన్ ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వస్తుంది.
AAP MLA Amit Ratan Kotphatta from Bathinda rural was arrested by Punjab Vigilance Bureau after he was caught taking a bribe. He was brought for a medical examination at a Government Hospital in Bathinda. pic.twitter.com/40H4YdCQUy