»Stock Market Today 22nd February Sensex 928 Points Down 3 5 Lakh Crore Lost
Stock Market Today: సెన్సెక్స్ 928 పాయింట్లు డౌన్..3.5 లక్షల కోట్లు ఖతం
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పెద్ద ఎత్తున నష్టాలతో చవిచూశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273, బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా దిగువకు పయనించాయి. దీంతో ఒక్కరోజే సమారు 3.5 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల(heavy losses)తో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 928 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 710 పాయింట్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59,745 వద్ద ఉండగా, నిఫ్టీ 17,554 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 39,996కు చేరువైంది.
ఈ నేపథ్యంలో BSEలో నమోదైన కంపెనీలపై ట్రేడ్ చేసిన మదుపర్ల(traders) సంపద బుధవారం ట్రేడింగ్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆవరైపోయింది. యూఎస్(USA) మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మరోవైపు ఫిబ్రవరిలో బిజినెస్ గణాంకాల నేపథ్యంలో ఆసియా, ఫసిఫిక్, ఐరోపా మార్కెట్లు సైతం దిగువకు పయనించాయి. ఇంకోవైపు ఫిబ్రవరి ద్వైమాసిక సమీక్షకు సంబంధించిన అంశాలను ఆర్బీఐ(rbi)తోపాటు అమెరికా ఫెడ్ బ్యాంక్(federal bank) కూడా ఈరోజే రిలీజ్ చేస్తుందని చెప్పడంతో మార్కెట్లపై భయాందోళన నెలకొంది. ఆ నిర్ణయాలు ద్రవ్యల్బణంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం ఇండియా(india)లో ద్రవ్యోల్బోణం(inflation) 6.5 శాతంగా కొనసాగుతుండగా, అమెరికా(America)లో 6.4 శాతంగా ఉంది.
ఈ నేపథ్యంలో అనేక కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. వాటిలో అదానీ(adani) ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్స్, ఎం అండ్ ఎం, హెడ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, టాటా(tata steel) స్టీల్, అల్ట్రా టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. దీంతో నిఫ్టీ, బీఎస్ఈ 1.53 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.67 శాతం షేర్లు లాస్ లోకి చేరాయి.