హిమాచల్ ప్రదేశ్ వరదల్లో తెలుగు మెడికోలు ముగ్గురు చిక్కుకున్నారు. ఈ నెల 8వ తేదీన వారు స్నేహితులతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి వారి మొబైల్స్ స్విచ్ఛాఫ్ వస్తున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలో 26.05 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంవత్సరం నికర లైవ్ టాక్స్ లు 17.63 శాతం పెరిగిందని తెలిపింది.
ఓడిశాలో OTV ప్రైయివేట్ న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తయారు చేసిన యాంకర్ లిసా వార్తలు చదివింది. AI యాంకర్ లిసా ఒడియా, ఇంగ్లీష్ భాషలలో వార్తలను చదువుతుండగా, రానున్న కాలంలో మరిన్ని భాషలలో ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది.
కేంద్రమంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. 22 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ లేదంటే లక్ష్మణ్.. ఏపీ నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్, లేదంటే కిరణ్ కుమార్‌కు పదవీ వరించనుంది.
వశిష్టుడ మహాముని శ్రీకృష్ణుడిని వెన్నతో చేసి కొలిచిన ప్రదేశం తమిళ్ నాడులోని నాగపట్నంలో ఉంది. వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట.
అంతరిక్ష నౌకను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.