»News Channel Launches Artificial Intelligence Created News Anchor In Odisha
Odisha: దేశంలోకి మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ వచ్చేసింది
ఓడిశాలో OTV ప్రైయివేట్ న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తయారు చేసిన యాంకర్ లిసా వార్తలు చదివింది. AI యాంకర్ లిసా ఒడియా, ఇంగ్లీష్ భాషలలో వార్తలను చదువుతుండగా, రానున్న కాలంలో మరిన్ని భాషలలో ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది.
news channel launches artificial intelligence created news anchor in Odisha
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఓ సాంకేతిక విజ్ఙానం. ఈ ఏఐ టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చే దిశగా అడుగులు వేగవంతం అయ్యాయి. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని చాలా మంది ఎన్నో ప్రయోగాలకు తెర లేపుతున్నారు. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రూపొందించిన న్యూస్ రీడర్ విషయం సంచలనంగా మారింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దేశంలోనే మొదటిసారి ఒడిశాలో OTV న్యూస్ ఛానల్ ఆర్టిఫీషియల్ మహిళా యాంకర్‌తో వార్తలు చదివించే విధానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతానికి AI యాంకర్ లిసా(AI Anchor Lisa) ఒడియా, ఇంగ్లీష్ భాషలలో వార్తలను చదువుతుండగా, రానున్న కాలంలో మరిన్ని భాషలలో ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ సాంకేతికతపై పలు అనుమానాలు ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా వర్చువల్ న్యూస్ రీడర్స్ వస్తే.. వార్తలు చదివే వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని కొందరు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఏఐ లిసా వార్తలు చదివే విధానానికి అందరూ ముగ్దులు అవుతున్నారు. నేత చీరకట్టుకొని చూడటానికి అచ్చం భారతీయ మహిళలా సాంప్రదాయంగా కనిపించే లిసా అందరికి తెగ నచ్చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్స్ వచ్చేశారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దేశంలోనే మొదటిసారి ఒడిశాలో OTV న్యూస్ ఛానల్ ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిఫీషియల్ మహిళా యాంకర్‌తో వార్తలు చదివించే విధానాన్ని ప్రారంభించింది