యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు ఢీకొన్ని ఘటన ఘజియాబాద్(Ghaziabad)లో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఢిల్లీ, మీరట్ ఎక్స్ప్రెస్ హైవే(Delhi -Meerut Expressway)పై రాహుల్ విహార్ సమీపంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
ఢిల్లీలోని ఘాజీపూర్ నుంచి స్కూలు బస్సు రాంగ్ రూల్ వెళ్లింది. ఆ సమయంలోనే మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు ఎస్యూవీ కారు(SUV Car) వెళ్తోంది. ఆ కారును స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానద్ కుష్వా (DCP Raamanand kushwa) వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదం(Road accident)లో ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.