ప్రముఖ స్టార్ యాంకర్ శివానీ సేన్(Anchor Shivani Sen) హఠాన్మరణం చెందారు. ఎపిలెఫ్టిక్ అటాక్ అనే మెదడు సంబంధిత సమస్యతో ఆమె తుదిశ్వాస విడిచారు. 36 ఏళ్లకే శివానీ మృతిచెందడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె మృతిపై పలువురు అభిమానులు, సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.
We have an extremely shocking and sad news to share. One of our own, @mcshivanisen is no more.🥹🥹
You left too soon Shivani, leaving a huge void. Life is so unfair at times. May your noble soul rest in peace!
2005లో శివానీ సేన్(Anchor Shivani Sen) హోస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అనేక కార్పొరేట్ ఈవెంట్లు, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మీడియా ఈవెంట్స్, సెలబ్రిటీల పెళ్లి వేడుకలు, ఫ్యాషన్ షోలు వంటి వాటికి యాంకరింగ్ చేసింది. హంస ఫర్ వెడ్డింగ్ అనే మ్యారేజ్ ఈవెంట్ కంపెనీలో శివానీ భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా ఆమె తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా ప్రారంభించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
— Urvish Kothari ~ उर्वीश कोठारी (@urvish2020) July 10, 2023
ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కూడా శివానీ హోస్ట్‌గా వ్యవహరించింది. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో జరిగే ఈవెంట్లకు కూడా శివానీ(Anchor Shivani Sen) హోస్ట్‌గా వ్యవహరించింది. ఇండస్ట్రీలో సమంత, రాశీఖన్నా వంటి సెలబ్రిటీలతో శివానీకి మంచి సంబంధాలున్నాయి. శివానీకి పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. ఆమె మరణంతో కుటుంబంలో, ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.