A young man is accused in a rape case in Uttar Pradesh. He swallowed a lizard in the police station.
అక్రమార్కుల ఆగడాలు కొన్ని భయానంకా ఉంటే మరి కొన్ని వింతగా ఉంటాయి. ఒక నిందితుడికి జైల్ అంటే భయం. మరి అలాంటి వ్యక్తి చట్టాన్ని గౌరవిస్తూ.. దాని పరిధిలో జీవిస్తే బాగుంటుంది. కానీ తన క్షణికావేశానికి తప్పు చేయడం చట్టం నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేయడం… చాలా చోట్ల ఇదే వరుస. ఇలాంటి ఒక సంఘటనే ఉత్తరప్రదేశ్లో( Uttar Pradesh)ని కాన్పూర్లో చోటుచేసుకుంది. జైల్ అంటే భయంతో ఓ యువకుడు ఏకంగా బల్లిని మింగేశాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో చాలా మందికి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు.
కాన్పుర్ లో ఓ బాలికపై మహేష్ అనే యువకుడు అత్యాచారానికిి పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లారు. సదరు ఎస్ఐ మహేష్ ను విచారిస్తున్నారు. బెదిరిపోయిన మహేష్ ఈ ఘటనలో దోషిగా రుజువై జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి పోలీసు స్టేషన్ లోనే బల్లిని మింగేశాడు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత అతన్ని కోర్టులో హాజరు పరిచారు. త్వరలోనే జైల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.