మద్యం మత్తులో కారు టాప్‌పై రెచ్చిపోయిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. కస్టమర్లకు భారీ తగ్గింపు ధరతో స్కూటీ ఇవ్వనుంది. ఓలా ఎస్1 ఎయిర్ మోడల్‌పై పది వేల వరకు తగ్గనుంది.
పాకిస్థాన్ వెళ్లి, నస్రుల్లాను పెళ్లి చేసుకున్న అంజూ వ్యవహారం అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
ఓ ఎద్దు రైతును పగబట్టినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఎటు వెళ్తే అటే వెళ్లడం. అతన్ని వెంబడించడం జరిగింది. ఆ క్రమంలో రైతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా ఓ చెట్టు ఎక్కాడు. అయినా కూడా ఆ ఎద్దు అక్కడే రెండు గంటల పాటు ఉండటం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హాకీ సమాఖ్య శత వసంత ఉత్సవాల సందర్భంగా స్పెయిన్‌పై టీమ్ ఇండియా మహిళ జట్టు ఘన విజయం సాధించింది. భారత్ టేబుల్ టాపర్‌గా ట్రోఫీని అందుకుంది.
స్పీడుగా వెళుతున్న కారు ఆకస్మాత్తుగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాదఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.
పలువురు యాపిల్(apples) రైతులు యాపిల్స్‌ను కాలువలో కుప్పులు కుప్పులుగా పడేస్తున్నారు. ఎంటని ఆరా తీస్తే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రోడ్ల పనులు ఆటంకంగా మారాయని వాపోయారు. అనేక రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో యాపిల్స్ పాడైపోతున్నాయని, అందుకే పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రయాణిస్తున్నజైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైళ్లో ఉద్యోగుల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ ఆకస్మాత్తుగా ఓ రైల్వే కానిస్టేబుల్ తన తోటీ ఉద్యోగితోపాటు ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు మృత్యువాత చెందారు.
మణిపూర్(Manipur)లో శాంతిని నెలకొల్పాలని కోరుతూ 21 మంది ప్రతిపక్షాల ఇండియా(INDIA) కూటమి సభ్యులు ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేకు మెమోరాండం(memorandum) సమర్పించారు.
ఐటీఆర్‌ల దాఖలులో సరికొత్త మైలురాయి నమోదైంది. జూలై 30న ఒక్కరోజు సాయంత్రం 6.30 వరకే కోటి 30 లక్షల మంది ఐటీఆర్(ITR)లు దాఖలు చేసినట్లు ఇన్ కం ట్యాక్స్ అధికారులు ప్రకటించారు. రేపే(జులై 31) చివరి రోజు అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైల్ చేస్తున్నారు.
దేశంలో సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది యువతులతోపాటు మహిళలు మిస్సైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తప్పిపోయారనే వివరాలను కూడా తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 36 కోట్ల రూపాయల విలువైన 5.2 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
మీరెప్పుడైనా మూడు కళ్లు ఉన్న ఎద్దును ఎక్కడైనా చుశారా? చాలా అరుదు అనే చెప్పవచ్చు. అంతేకాదు ఆ ఎద్దుకు కొమ్ములు కూడా మూడే ఉండటం విశేషం. దానిని చూసిన అక్కడి స్థానికులు పరమశివుడి అవతారంగా భావిస్తూ మొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పట్టణాల్లో హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేసే వారికి షాకింగ్ న్యూస్. ఇకపై హాస్టళ్లు, పీజీల్లో ఉండేవారికి జీఎస్టీ భారం పడనుంది. హాస్టల్ వసతిపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ తీర్పునిచ్చింది.
5 ఏళ్ల చిన్నారిని ఓ కామాంధుడు పొట్టబెట్టుకున్నాడు. అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది.