Heroin: రూ.36 కోట్ల విలువైన 5.2 కేజీల హెరాయిన్ పట్టివేత
దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 36 కోట్ల రూపాయల విలువైన 5.2 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు హెరాయిన్‌గా అనుమానిస్తున్న 5.2 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి నిర్వహిస్తున్న ఈ రాకెట్లో సూత్రధారి అని చెప్పబడుతున్న ఒక నైజీరియన్ జాతీయుడితో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాల్గొన్న గోవాకు చెందిన ఒక మహిళను కూడా డిఆర్ఐ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.36 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
DRI arrested 3 persons involved in drug smuggling, comprising an Indian carrier (at Delhi Airport), an intermediary (an Indian Female at Goa) and the mastermind, a Nigerian National (Delhi). 5.2 KG of Heroin was recovered in the operation: CBIC pic.twitter.com/2mdYCh3BYZ
ఈ కేసులో తొలి అరెస్టు శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగినట్లు కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ గురించి నిర్దిష్ట సమాచారం జూలై 29న అందుకున్న వెంటనే DRI అధికారులు శనివారం మలావి నుంచి అడిస్ అబాబా మీదుగా వచ్చిన ఒక భారతీయ జాతీయుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. తనిఖీ సమయంలో, ప్రయాణీకుల ట్రాలీ బ్యాగ్‌లలో ఒకదానిలో రెండు వేర్వేరు ప్యాకేజీలలో దాచిన సుమారు 5.2 కిలోల బరువున్న హెరాయిన్‌గా అనుమానిస్తున్న మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను సరుకును ఒక మహిళకు అందించడానికి గోవాకు వెళ్లాల్సి ఉందని వెల్లడించాడు. ఆ క్రమంలో గోవాలోని పేర్కొన్న హోటల్ వద్ద ఒక తనిఖీ నిర్వహించగా అక్కడ సరుకును స్వీకరించడానికి వచ్చిన ఒక భారతీయ మహిళ కూడా దొరికింది. అయితే నిషిద్ధ సరుకును డెలివరీ చేసేందుకు ఆ మహిళ ఉదయం హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లింది.