ఐటీఆర్‌ల దాఖలులో సరికొత్త మైలురాయి నమోదైంది. జూలై 30న ఒక్కరోజు సాయంత్రం 6.30 వరకే కోటి 30 లక్షల మంది ఐటీఆర్(ITR)లు దాఖలు చేసినట్లు ఇన్ కం ట్యాక్స్ అధికారులు ప్రకటించారు. రేపే(జులై 31) చివరి రోజు అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైల్ చేస్తున్నారు.
ఇండియాలో ఉన్న వ్యాపారస్తులు సహా ఉద్యోగులు ఐటీఆర్(ITR)లు దాఖలు చేయడంలో తెగ పోటీ పడుతున్నారు. ఎందుకంటే రేపే(జులై 31) చివరి తేదీ. అయితే ఈ క్రమంలో ఇప్పటివరకు (జూలై 30న) 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయాని ఇన్ కం ట్యాక్స్ అధికారులు వెల్లడించారు. అందులో ఈరోజు సాయంత్రం 6.30 గంటల వరకు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 1.30 కోట్లకు పైగా విజయవంతమైన లాగిన్లను చూశామని పేర్కొన్నారు. దీంతోపాటు ITR ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం సహాయం చేయడానికి తమ హెల్ప్‌డెస్క్ 24×7 పని చేస్తుందన్నారు. కాల్లు, లైవ్ చాట్లు, WebEx సెషన్లు & సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ మైలురాయిని చేరుకోవడంలో వారికి సహకరించిన పన్ను చెల్లింపుదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు 2023-24 కోసం ITR ఫైల్ చేయని వారు ఉంటే చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా తమ ITRని ఫైల్ చేయాలని కోరారు.
జులై 27, 2023 వరకు దాఖలు చేసిన 5.03 కోట్ల ఐటీఆర్‌లలో దాదాపు 4.46 కోట్ల ఐటీఆర్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయి. అంటే దాదాపు 88 శాతానికి పైగా ఐటీఆర్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. జీతం పొందే ఉద్యోగులు 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం తమ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వారు ITRలను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31గా నిర్ణయించారు. మీ ఆదాయం మొత్తం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, మీరు తప్పనిసరిగా మీ ITRని ఫైల్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.