2024 సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్‌కు (ITR filing) చివరి రోజు కావడంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్నుల ఫైలింగ్‌కు పోటెత్తుతున్నారు. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య గంట వ్యవధిలో ఏకంగా 3.39 లక్షల మంది రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ (IT Department) తెలిపింది. ఇవాళ ఒక్కరోజే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11.03 లక్షల రిటర్నులు ఫైల్ దాఖలైనట్లు పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏవైనా ఇబ్బందులు ఉంటే orm@cpc.incometax.gov.inకు మెయిల్ చేయాలని సూచించింది.మరోవైపు రిటర్నుల దాఖలుకు చివరి రోజు కావడంతో ట్విటర్లో ఉదయం నుంచి #IncomeTaxReturn హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో గడువు పొడిగించాలని ఐటీ శాఖను అభ్యర్థిస్తున్నారు.
వర్షం కారణంగా కొందరు రిటర్నులు (Returns) చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఊరటనిచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు ఈ హ్యాష్‌ట్యాగ్ వేదికగా కొందరు తమకెదురైన సాంకేతిక ఇబ్బందులను ఐటీ శాఖ దృష్టికి తెస్తున్నారు. ఇంకొందరు మాత్రం లాస్ట్ డే పన్ను చెల్లింపుదారుల పరిస్థితి ఇదీ అంటూ మీమ్స్ రూపొందిస్తున్నారు.జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్ పోర్టల్ (Filing Portal) పనితీరు బాగుంది. ఫైలింగ్ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చని ట్వీట్ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్ లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే లేట్ ఫీ రూ.5,000 చెల్లించాలి.