»13 13 Lakh Women Are Missing In The Country In Three Years
Girls missing: మూడేళ్లలో 13.13 లక్షల మహిళలు మిస్సింగ్..ఏపీలో
దేశంలో సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది యువతులతోపాటు మహిళలు మిస్సైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తప్పిపోయారనే వివరాలను కూడా తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియా(india)లో 2019 నుంచి 2021 మధ్య మూడేళ్లలో 13.13 లక్షలకు పైగా బాలికలు(girls) సహా మహిళలు అదృశ్యమయ్యారు. వారిలో ఎక్కువ మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఉండగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తప్పిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక వెల్లడించింది. గత వారం పార్లమెంట్లో సమర్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019 నుంచి 2021 మధ్యకాలంలో 18 ఏళ్లు పైబడిన మహిళలు 10,61,648 మంది, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు 2,51,430 మంది అదృశ్యమయ్యారు.
మధ్యప్రదేశ్(madhya pradesh)లో 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని నివేదికలో పేర్కొన్నారు. ఇదే కాలంలో పశ్చిమ బెంగాల్(West Bengal)లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మహారాష్ట్రలో ఈ కాలంలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఒడిశాలో మూడేళ్లలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు, ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు అదృశ్యమయ్యారు. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీలో అత్యధికంగా తప్పిపోయిన బాలికలు మహిళలు నమోదయ్యారు. దేశ రాజధానిలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు అదృశ్యమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో 8,617 మంది మహిళలు, 1,148 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున మహిళల మిస్సింగ్ పట్ల ప్రతిపక్ష నేతలతోపాటు సామాన్య పౌరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నేరాలు, మిస్సింగ్ కంప్లైట్ల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు చిన్నారులు అక్రమ రవాణాలో ఏపీ(AP) 3వ స్థానంలో ఉందని గేమ్స్ 247 అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. 2016 నుంచి 2022 మధ్య కాలంలో చేసిన సర్వే ఆధారంగా తెలిపింది. ఈ క్రమంలో బీహర్, యూపీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు చెప్పింది. జిల్లాల వారీగా రాజస్థాన్‌లోని జైపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీలోని గుంటూరు ఆరో స్థానంలో ఉంది.