నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో 82 ఏళ్ల వ్యక్తికి కోర్టు 383 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
దుబాయ్ మెగా లాటరీలో భారతీయ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. 25 ఏళ్ల పాటు ఆ వ్యక్తి ప్రతి నెలా రూ.5.5 లక్షలను అందుకోనున్నాడు.
సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటుగా అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వి – సీ56 రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.
ఓ వ్యక్తి తన అన్నయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాడు. బంధాలను మర్చిపోయి, ఆచారాలను వదిలి కుటుంబ సమక్షంలోనే ఆ జంట హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల సోనియా గాంధీ ఇంటికి వచ్చిన హర్యానా మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
సౌత్ ఇండియాలో మీకు ఇళ్లు అద్దెకు కావాలంటే రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అవును మీరు విన్నది నిజమే. అది ఇళ్లు కొనడానికి కాదు. కేవలం అద్దె కోసం ఈ రేటు. ఇంత ధర ఎక్కడ? అసలు ఎందుకో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
తమిళనాడులో బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
బీజేపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్‌ను తీసుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
సంక్రాంతి పండుగ వస్తే చాలు ప్రతి ఏటా ఏపీలో కోడి పందెలు నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో గెలిచిన కోడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు దానికి పెద్ద మొత్తం ప్రైజ్ కూడా వస్తుంది. అయితే ఆ పందెం గెలిచిన కోడిపుంజును చూసిన ఓ వ్యక్తి దాని కోసం ఏకంగా థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చాడు. కానీ దాన్ని ఇచ్చేందుకు యాజమాని నో చెప్పాడు. అదెక్కడో చుద్దామా?
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2(Bharat Jodo Yatra 2)ను నిర్వహించేందుకు కాంగ్రెస్(congress) నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర సెప్టెంబర్ మాసంలో మొదలు కానున్నట్లు తెలిసింది.
కాలేజీ టాయిలెట్స్ లో మహిళల నగ్న చిత్రాలను చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్భూ సందర్ స్పందించారు.