»If You Want A Room In Bangalore Rs 25 Lakhs Should Be Deposited
Room: రూమ్ కావాలంటే రూ.25 లక్షలు డిపాజిట్ చేయాలి!
సౌత్ ఇండియాలో మీకు ఇళ్లు అద్దెకు కావాలంటే రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అవును మీరు విన్నది నిజమే. అది ఇళ్లు కొనడానికి కాదు. కేవలం అద్దె కోసం ఈ రేటు. ఇంత ధర ఎక్కడ? అసలు ఎందుకో ఇప్పుడు చుద్దాం.
If you want a room in Bangalore Rs. 25 lakhs should be deposited
Bangalore: దక్షిణ భారతదేశంలో(South India) అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాల్లో బెంగళూరు(Bangalore) ఒకటి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా(Silicon Valley of India) పేరున్న ఈ నగరం ఐటీ ఉద్యోగస్తులకు నెలవు. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ఇళ్ల రేట్లు, ట్రాఫిక్. మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి జనాభా ఎక్కువగానే ఉంటుంది. ఈ సిటీలో ఓ ఇల్లు అద్దె గురించిన తాజా వార్త నెట్టింట్ల వైరల్గా మారింది. ఈ విషయం తెలిసి ప్రజలు నోర్లు ఎల్లబెడుతున్నారు. నాలుగు బెడ్ రూంలు ఉన్న ఆ ఫ్లాట్ అద్దె(Flat rent) నెలకు ఏకంగా రూ. 2.5 లక్షలట. అంతేకాదు ఈ ఫ్లాట్ కావలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25 లక్షల చెల్లించాలట. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతుంది.
నో బ్రోకర్ యాప్(No Broker App)లో ఉన్న ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేశారు. 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో ఉందని, దీనికి అద్దె కింద నెలకు రెండున్నర లక్షలు చెల్లించాలని, అంతే కాకుండా ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరువైదు లక్షలు డిపాజిట్ చేయాలని ఉంది. దీని కిందే అంత మొత్తాన్ని లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉండడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. తేజస్వీ శ్రీవాస్తవ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ చేశారు. దీనిని చూసిన పలువురు కిడ్నీ డొనేషన్ ఆప్షన్ కూడా పెడితే బాగుండు అని కామెంట్ చేస్తున్నారు.