»Super Star Rajinikanth Cant See The Srh Owner Kavya Maran Pain
Rajinikanth: SRH యజమాని బాధను చూడలేకపోయా
సూపర్‌స్టార్ రజినీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad owner) యజమాని కావ్య మారన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో తన జట్టు ఓడిపోవడాన్ని చూసి ఆమె భావోద్వేగాలను చూడలేకపోయానని పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది అభిమానులు దీంతోపాటు ఆయా ఫ్రాంచైజీల యాజమానుల భావోద్వేగాలతో కూడి ఉత్కంఠగా ఉంటుంది. అయితే 2023 ఐపీఎల్ చూసిన వారిలో లెజెండరీ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. అయితే తాజాగా అతని రాబోయే చిత్రం జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీకాంత్(Rajinikanth) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని కావ్య మారన్(kavya maran) గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
IPL ఆటల సమయంలో SRH జట్టు ఓటమి చవిచూస్తున్నప్పుడు కావ్య మారన్ బాధతో కనిపించే భావోద్వేగాలను టీవీ ఛానెళ్లలో చూడలేకపోయానని రజినీకాంత్ పేర్కొన్నారు. ఆ సందర్భంలో ఛానెల్ మార్చేవాడినని అన్నారు. ఐపీఎల్ సమయంలో టీవీలో కావ్యను అలా చూడడం తనకు బాధగా ఉండేదని వెల్లడించారు. అంతేకాదు మంచి ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకురావాలని సూపర్ స్టార్ కావ్య తండ్రి, SRH ఫ్రాంచైజీ యజమాని కళానిధి మారన్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు. జట్టు ప్రదర్శనను మెరుగుపరిచేందుకు మెరుగైన ఆటగాళ్లపై పెట్టుబడిగా పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ను కోరాడు. జట్టును బలోపేతం చేయాలని సూచించారు. అయితే కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి 2023 IPL సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad owner)కు సవాలుగా మారింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో క్రీడాభిమానులు నిరాశపడ్డారు. ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్సీలో SRH కొన్ని మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. అయితే అనుభవం లేని బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కారణంగా నిలకడను కొనసాగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సీజన్‌కు ముందు SRH మేనేజ్మెంట్ IPL 2023 వేలం సమయంలో తెలివిగా పెట్టుబడి పెట్టింది. వేలం సమయంలో యజమానులు, కోచ్‌లు తెలివిగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, జట్టు మైదానంలో టైటిల్ పోరులో నిలువలేక అభిమానులను నిరాశపరిచింది.