»Elur Came From Thailand And Bought Hen For Rs 3 Lakhs
Viral News: కోడిపుంజు కోసం దేశం దాటి వచ్చిన వ్యక్తులు..చివరకు
సంక్రాంతి పండుగ వస్తే చాలు ప్రతి ఏటా ఏపీలో కోడి పందెలు నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో గెలిచిన కోడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు దానికి పెద్ద మొత్తం ప్రైజ్ కూడా వస్తుంది. అయితే ఆ పందెం గెలిచిన కోడిపుంజును చూసిన ఓ వ్యక్తి దాని కోసం ఏకంగా థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చాడు. కానీ దాన్ని ఇచ్చేందుకు యాజమాని నో చెప్పాడు. అదెక్కడో చుద్దామా?
Elur came from Thailand and bought hen for Rs. 3 lakhs.
Viral News: కోడిపందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పందెంలో గెలిచిన పుంజును కన్న బిడ్డలాగ చూసే ఆచారం ఇప్పటిది కాదు. అయితే అలా పందెం గెలిచిన పుంజును కొనడానికి థాయిలాండ్(Thailand) నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. కానీ ఆ యజమాని ససేమీరా అనడంతో ఇంకో పుంజును బేరం ఆడీ రూ.3 లక్షలకు కొనుక్కుని వెళ్లారు. ఈ సంఘటన ఏపీలోని ఏలూరు(Elur) జిల్లా లింగపాలెం మండలంలోని రంగాపుర గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కూరాకుల రత్తయ్య కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం కోడిపందేల ఆటలో భోగి రోజున ఆయన తన పుంజుతో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో రూ. 27 లక్షల పందెం కాసి నెగ్గాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అయింది.
అది చూసిన థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతులు ఆ పుంజును కొనుక్కోవాలని భావించి ఏకంగా ఇండియాకు వచ్చేశారు. అలా జిల్లాకు వచ్చి వివరాలు తెలుసుకొని ఆ గ్రామానికి చేరుకుని రత్తయ్యను కలిశారు. ఆ కోడిపుంజు కావాలని ఏంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ దాన్ని అమ్మేందుకు అతను నిరాకరించడంతో మరో కోడిపుంజును రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు. పందెంలో గెలిచిన కోడితో ఫొటోలు దిగి సంతోషంగా వెళ్లారని రత్తయ్య వెల్లడించారు.