Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు శుక్రవారం రాత్రి జారీ చేశారు. గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని దాదాపు 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూలై నెలలో ఇక్కడ వరదలు హెచ్చరిక స్థాయిని దాటడం ఇది మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి గోదావరి నదిలోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండడంతో వరద ఉధృతి పెరుగుతోందని అధికారులు అంటున్నారు.
#Godavari floods Warning ⚠️ Now bhadrachalam godavari water level reached 53 feet .till mrng it may reach upto 60feet .third warning issued ⚠️⚠️ pic.twitter.com/XqGSo9JS1F
— Telangana state Weatherman (@tharun25_t) July 28, 2023