దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రభుత్వాలు కఠిన నిబంధనలను తీసుకొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడో ఓ చోట ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. పసి పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ అత్యాచారాలకు బలైపోతున్నారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వా తకూడా దేశంలో ఇప్పటికీ సామూహిక అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
కేరళలో 5 సంవత్సరాల వయసున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొచ్చిన్‌లోని అలువా అనే ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలు కొచ్చిన్లోనే పని చేసుకుంటూ బతుకుతున్నారు. వలస కూలీల దంపతులకు చెందిన కుమార్తెను మరో వలస కూలియే కిడ్నాప్ చేశాడు.
కూతురి కోసం తల్లిదండ్రులు గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. చిన్నారిని తాను అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. డంపింగ్ యార్డులో పారేసి ఉన్న చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. చిన్నారిని అత్యాచారం చేసి గొంతు నులుమి చంపినట్లు రిపోర్ట్‌లో తేలింది.