నవంబర్ 30న వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. ఈ సంభాషణ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతుంది.
రైలులో ప్రయాణిస్తూ.. దాంట్లో వడ్డించిన ఆహారం తిని 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి పూణెకు వస్తున్న భారత్ గౌరవ్ యాత్ర రైలులో రైల్వే ఆహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
ఎదురింటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను కర్ర చూపించి, పరుగెత్తించింది ఓ మహిళ. ఈ ఘటన హర్యానాలో గల భివానీలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చైనాలో న్యుమోనియా(Pneumonia) వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక(karnataka) ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ నెలలో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మరి ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో, ఏయే రోజుల్లో బ్యాంకులు అందుబాటులో ఉంటాయో తెలుసుకోండి.
యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం..ఎవరైనా కొత్త వ్యక్తులకు రూ.2 వేలకుపైన ట్రాన్సాక్షన్స్ చేశాక మరో ట్రాన్సాక్షన్ అదే వ్యక్తికి చేయడానికి 4 గంటల పాటు సమయం పట్టనుంది. దీంతో డిజిటల్ పేమెంట్స్ మరింత ఆలస్యం కానున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకే ఈ రూల్‌ను తీసుకొస్తున్నట్లు యూపీఐ వెల్లడించింది.
ఉత్తరకాశీలోని టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తోంది. ఒక్కొక్కరినే టన్నెల్ లో అమర్చిన సేఫ్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 17 రోజుల తర్వాత కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రావడంతో కుటుంబీకుల్లో ఆనందం నెలకొంది.
ముస్లింల పండుగల సెలవులను పెంచి..హిందూ పండుగలకు సెలవులను తగ్గించారు. నితీష్ కుమార్ బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 2024 సెలవుల క్యాలెండర్‌ను ప్రకటించిన క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ యుగపురుషుడు అని ఉప రాష్ట్రపతి ధన్ కర్ కీర్తించారు. ఆ కామెంట్లను కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వ్యక్తి పూజ చేసేందుకు ఇంతలా దిగజారాలా సార్ అని కామెంట్ చేశారు.
రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలు దాదాపు చివరకు వచ్చాయి. 57 మీటర్ల టన్నెల్ లోనికి వెళ్లేందుకు ఇప్పటికే 54 మీటర్లను తవ్వేశారు. కాసేపట్లో కూలీలను బయటకు తీసుకురానున్నారు.
కొంతకాలం క్రితం గుండెపోటు, గుండె జబ్బులు వంటివి వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ఈ వ్యాధి క్రమంగా యువత, పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. సిద్ధార్థనగర్ జిల్లాలో ముస్లిం ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ శ్రీరామ కథలో పాల్గొన్నారు. తర్వాత తరువాత బిజెపీ, హిందూ సంస్థల కార్యకర్తలు శుద్ధి చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి.
దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు.
గుజరాత్‌లో ఆదివారం రోజు మొత్తం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 14 మంది మృతి చెందినట్లు ఎస్‌ఈఓసీ కంట్రోల్ రూమ్ సిబ్బంది మీడియాకు తెలిపారు.