»One By One Out Of The Tunnel Families Waiting With Excitement
Uttarakhand: టన్నెల్ నుంచి ఒక్కొక్కరే బయటకు..కుటుంబీకుల్లో ఆనందోత్సాహం
ఉత్తరకాశీలోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తోంది. ఒక్కొక్కరినే టన్నెల్ లో అమర్చిన సేఫ్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 17 రోజుల తర్వాత కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రావడంతో కుటుంబీకుల్లో ఆనందం నెలకొంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని టన్నెల్ (Tunnel)లో 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. 17 రోజుల పాటు టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల కోసం వారి కుటుంబీకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ క్షేత్రాలు అయినా బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రభుత్వం ఓ సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది. సుమారు 4.5 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మిస్తుండగా టన్నెల్ కూలిపోయింది. 205వ మీటరు నుంచి 260వ మీటరు వరకూ టన్నెల్ మూసుకుపోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.
టన్నెల్ (Tunnel) లోపల 41 మంది కార్మికులు చిక్కుకుపోగా వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఓ పైపు ద్వారా వారికి ఆహారాన్ని సరఫరా చేస్తూ 17 రోజుల పాటు కాపాడారు. కార్మికులు నీరసపడిపోకుండా వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, డ్రై ఫ్రూట్స్, మల్టీ విటమిన్స్ మాత్రలు అందించారు. టన్నెల్ నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక యంత్రాంగం రంగంలోకి దిగింది.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: Locals distribute sweets outside Silkyara tunnel as trapped workers are being rescued from the tunnel pic.twitter.com/oASZAy8unf
అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ తన బృందంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాడు. ప్రస్తుతం కార్మికులు ఒక్కొక్కరినే బయటకు తీసుకొస్తున్నారు. ఎస్కేప్ పైప్ ద్వారా కార్మికులు ఒక్కొక్కరినీ రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకు వస్తున్నారు. మట్టి తొలగింపు పూర్తి చేసిన తర్వాత 15 నిమిషాల వ్యవధిలో నలుగురు కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గంటలో అందర్నీ బయటకు తీసుకొచ్చారు. దీంతో 41 మంది కార్మికులు సేఫ్ అయ్యారు.
#WATCH | The first worker among the 41 workers trapped inside the Silkyara tunnel in Uttarakhand since November 12, has been successfully rescued. pic.twitter.com/Tbelpwq3Tz