»Nitish Kumar Bihar Government Has Cancelled Holidays For Hindus Muslim Festivals Increase
Hindu festival holidays cancel: ముస్లిం పండుగలకు సెలవులు, హిందువులకు రద్దు చేసిన ప్రభుత్వం..నెటిజన్ల ఆగ్రహం
ముస్లింల పండుగల సెలవులను పెంచి..హిందూ పండుగలకు సెలవులను తగ్గించారు. నితీష్ కుమార్ బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 2024 సెలవుల క్యాలెండర్ను ప్రకటించిన క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
nitish kumar bihar government has cancelled holidays for hindus Muslim festivals increase
బీహార్ ప్రభుత్వం ఇటివల స్కూల్ సెలవుల విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్(nitish kumar) నేతృత్వంలోని ప్రభుత్వం హిందు పండుగలకు సెలవులు తగ్గించి, ముస్లిం పండుగలకు సెలవులను పెంచింది. ఈ అంశంపై అక్కడి ఇతర పార్టీ నేతలతోపాటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार”
एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं।
2024 స్కూల్ సెలవుల్లో(Hindu festival holidays 2024) భాగంగా జన్మాష్టమి, రక్షాబంధన్, రామనవమి, శివరాత్రి, తీజ్, వసంత పంచమి, జీవితపుత్రిక సందర్భంగా సెలవులను తొలగించింది. అదే సమయంలో ఈద్, బక్రీద్లకు ఆరు రోజులు, మొహర్రం కోసం రెండు రోజులు సెలవులు ఇచ్చారు. సోమవారం (నవంబర్ 27) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్లో ఈ మేరకు ప్రకటించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. అయితే విద్యార్థులకు ఈ మార్పు చేయలేదు. ఉపాధ్యాయులకు ఉన్న 60 రోజుల సెలవుల్లో 38 రోజులు విద్యార్థులు పాఠశాలకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో 22 రోజులు మాత్రమే విద్యార్థులకు సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు.
#WATCH | Patna: After CM Nitish Kumar-led Bihar government reportedly reduced the number of holidays for the state’s schools during the Hindu festivals, (JD-U) leader Neeraj Kumar says, “…The holidays of Shab-e-Barat have been reduced and there is no discussion over it…Maha… pic.twitter.com/Moja2jHq6m
అంతేకాదు మే 1న జరుపుకునే కార్మిక దినోత్సవం(labour day) సెలవును కూడా రద్దు చేశారు. దీంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతిని జరుపుకునే అక్టోబర్ 2న ఇక సెలవు ఉండదన్నారు. గొప్ప వ్యక్తుల జయంతి సందర్భంగా పాఠశాలలు పనిచేస్తాయని, విరామ సమయానికి ముందే తరగతులు నిర్వహించాలని, ఆ తర్వాత జన్మదిన వేడుకలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. మహనీయుల విలువలు, వ్యక్తిత్వం గురించి పిల్లలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi: After CM Nitish Kumar-led Bihar government reportedly reduced the number of holidays for the state’s schools during the Hindu festivals, Union Minister Giriraj Singh says, “…Hindu holidays have been slashed while Muslim festival holidays have been increased.… pic.twitter.com/V2UBXaMraT
ఈ పరిణామంపై బీజేపీ నేతలు(bjp leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ నితీష్ కుమార్ హిందువుల వ్యతిరేక అని మరోసారి అర్థమవుతుందన్నారు. ఓటు బ్యాంకు కోసం సనాతన్ను ద్వేషిస్తున్న ప్రభుత్వానికి సిగ్గుచేటని కేంద్ర మంత్రి అశ్విని చౌబే X పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసిన బిజెపి నాయకుడు సుశీల్ మోడీ నితీష్ కుమార్ పరిపాలన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. బీహార్ ప్రభుత్వం ఇస్లామిక్ మత విశ్వాసాల ఆధారంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
#WATCH | Patna: After CM Nitish Kumar-led Bihar government reportedly reduced the number of holidays for the state’s schools during the Hindu festivals, BJP MP Sushil Modi says, “Nitish Kumar-led Bihar government has shown an anti-Hindu face and taken a decision to hurt the… pic.twitter.com/vkmwMbANyu