»A Woman With Stick Charged The Shooters Scared Them Away
Stickతో బెదిరించిన మహిళ.. పారిపోయిన దుండగులు
ఎదురింటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను కర్ర చూపించి, పరుగెత్తించింది ఓ మహిళ. ఈ ఘటన హర్యానాలో గల భివానీలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
A Woman With Stick Charged The Shooters Scared Them Away
Woman With Stick: ఢిల్లీ, హర్యానా, ముంబై, బీహార్‌లో నేరాలు ఎక్కువ.. బహిరంగ ప్రదేశాల్లో తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలు చూశాం. ఆయా చోట్ల నిత్యం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. హర్యానా భివానిలో కూడా దుండగులు ఇలా కాల్పులు జరిపారు. ఎదురింటి మహిళ (Woman) చూపిన ధైర్య సాహసాలతో దుండగులు తోక ముడిచారు.
ఏం జరిగిందంటే..?
హరికిషన్ సింగ్ (Harikishan singh) అనే వ్యక్తి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది. హత్య కేసులో హరికిషన్ (hari kishan) నిందితుడు.. బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆ కేసు.. ఇతర కేసుల విషయాల్లో మిగతా వారు ఇతనిపై పగతో ఉన్నారు. సమయం కోసం చూశారు. అలా రెండు బైకుల మీద వచ్చి కాల్పులు జరిపారు.
వారికి అనూహ్య పరిణామం ఎదురైంది. బైక్ మీద వచ్చిన వారిని హరికిషన్ (hari kishan) పట్టించుకోలేదు. వారిలో ఒకడు దిగి తుపాకీ తీయడంతో అలర్ట్ అయ్యాడు. పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లాడు. అయినప్పటికీ ఇద్దరు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. గన్ సౌండ్ విన్న మహిళ వచ్చింది. పొడవాటి కర్ర తీసుకుని వచ్చింది. ఇద్దరి చేతిలో గన్ ఉన్న భయపడలేదు. పైగా వారిని బెదిరించింది. దీంతో వారే పారి పోయారు.
Wild scenes from Haryana:
– 4 guys attempts to shoot at a man standing in front of his house.
– The shooters miss & the man escapes into his house.
– A woman with broomstick charged at the shooters & scared them away.
ఇంతలో హరికిషన్‌కు ఏమైంది అని కూడా చూసింది. వాళ్లు వెళ్లారా లేదా అని నిర్ధారించుకుంది. ఆ మహిళ చూపిన తెగువ వల్లే హరికిషన్‌కు ప్రాణపాయం తప్పింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో తూటాలు తగిలినట్టు తెలుస్తోంది.