»No Rain Alert For Andhra Pradesh And Telangana Today Due To No Clouds Says Imd Weather Official
Weather Report: నాయకులు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేనా.. నవంబర్ 30న భారీ వర్షం?
దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు.
Weather Report: దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. బంగాళాఖాతంతో పాటు.. అరేబియా సముద్రం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. తుఫాను తరహా వాతావరణం రాజస్థాన్ సమీపంలో ఉంది. దీని ప్రభావంతో ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలలో వర్ష సూచన ఉంది. ఈ రాష్ట్రాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. దీని ప్రభావంతో.. అండమాన్ నికోబార్‌లో ఈరోజు (సోమవారం) వర్ష సూచన ఉంది. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదు.
శాటిలైట్ వర్షపాతం అంచనా ప్రకారం ఈరోజు తూర్పు రాయలసీమలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు లేవు. ఈరోజు కూడా మేఘాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. రాయలసీమతో పోలిస్తే తెలంగాణ, ఉత్తరాంధ్రలో ఎండలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దక్షిణ భారతం, ఆసియాలో మేఘాలు ఎక్కువగా ఉన్నందున.. అవి మన తెలుగు రాష్ట్రాల వైపు వస్తే పోలింగ్ రోజు అంటే నవంబర్ 30న వర్షం కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో నవంబర్ 30 నాటికి మేఘాలు వచ్చే అవకాశం ఉంది. మలేషియా సమీపంలో తుఫాను ఏర్పడుతోంది. దీని ప్రభావంతో మేఘాలు మన దేశం వైపు వస్తే పోలింగ్ పై వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, తెలంగాణలో రాత్రి కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే.. పగటిపూట గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో రాత్రి కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పగటి సమయం గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.