దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ నెల నుంచి పలు నిబంధనల్లో మార్పు జరిగింది. మారిన ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదలను తక్షణమే ఆపాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు స్పష్టంచేసింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఆకస్మాత్తుగా ఈరోజు బెంగళూరులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు(Bomb threat) ఇమెయిల్స్ అందాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయులను ఖాళీ చేయించారు.
టాయిలెట్ వస్తుందని, బస్సు ఆపమని కోరితే ఓ కండక్టర్ రాక్షసుడిలా వ్యవహరించాడు. కదిలే బస్సు నుంచి తోసివేశాడు. దీంతో ఆ ప్యాసెంజర్ కన్నుమూశాడు.
రక్షణ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. రెండు మెగా కంబాట్ ఫైటర్ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్ డీల్ సహా దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులపై ప్రభుత్వం సమావేశం నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
మన చుట్టూ ఉన్న గాలి రోజురోజుకూ విషపూరితంగా మారుతోంది. ప్రపంచంలోని అన్ని ఏజెన్సీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే రాజ్యసభ ఎంపీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభలో లేవనెత్తిన అంశాలపై ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడు రాజధాని చెన్నై సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులు, తుపాను, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇవ్వనుంది. డ్రోన్లపై శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి తోడ్పడనుంది. ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చి మహిళా సంఘాలు ఆదాయం పొందొచ్చు. కేంద్రం అందించే ఈ డ్రోన్ల సాయంతో ఎరువుల వాడకం, పురుగు మందుల పిచికారీ వంటివి చేయొచ్చు.
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పదవీకాలం పొడిగింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని నియమించే హక్కు, అధికారం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజస్థాన్‌లోని భివాడికి చెందిన అంజు సుమారు 5 నెలల తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది. అంజు భర్త నస్రుల్లా ఆమెను వాఘా బోర్డర్‌లో డ్రాప్ చేయడానికి వచ్చాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనపై రాసిన పుస్తకాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు.
తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అత్యంత విషమంగా ఆయన ఆరోగ్యం ఉందని, మరో 14 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.