ప్రతి నెలలో కూడా కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అలాగే డిసెంబర్ 1వ తేది నుంచి కూడా కొన్ని నిబంధనలు మారుతున్నాయి. బ్యాకింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో మారిన ఆ నిబంధనలు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తాజాగా మారిన ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిమ్ కార్డ్ రూల్:
డిసెంబర్ 1వ తేదీ నుంచి సిమ్ కార్డుల జారీలో నిబంధనలు మారాయి. ఇకపై సిమ్ కార్డ్ డీలర్లు కచ్చితంగా బల్క్ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలులేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. సిమ్ కార్డులు తీసుకోవడానికి పోలీసుల వెరిఫికేషన్ తప్పనిసరి అని తెలిపింది.
లాకర్ నిబంధనల్లో మార్పులు:
కస్టమర్లు, బ్యాంకుల మధ్య లాకర్ ఒప్పందాల గడువు డిసెంబర్‌తో ముగిసింది ఈ తరుణంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు, బ్యాంకుల మధ్య లాకర్ ఒప్పందాల పునరుద్దరణ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆధార్ కార్డులో మార్పులు:
మై ఆధార్ పోర్టల్ ద్వారా కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ వివరాలను డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా సవరించుకునే అవకాశం ఉంది. గతంలో సెప్టెంబర్ 14వ తేదీ వరకూ ఉన్న ఆ ఆఖరు గడువు ఇప్పుడు డిసెంబర్ 14వ తేది వరకూ పొడిగించారు.