»Instructions Issued For All Rajya Sabha Mp Winter Session 2023 Starting From Monday
Parliament Session: శీతాకాల సమావేశాల్లో ఎంపీలు ఇవి తప్పకుండా పాటించాల్సిందే !
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే రాజ్యసభ ఎంపీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభలో లేవనెత్తిన అంశాలపై ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
BJP's Stinging Reply To RJD's Coffin Comparison For New Parliament
Parliament Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే రాజ్యసభ ఎంపీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభలో లేవనెత్తిన అంశాలపై ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. నోటీసును చైర్మన్ ఆమోదించి, ఇతర ఎంపీలకు తెలియజేసే వరకు నోటీసులను బహిరంగపరచవద్దని సూచనలలో స్పష్టంగా తెలియజేయబడింది. ఏప్రిల్ 2022లో ప్రచురించబడిన రాజ్యసభ సభ్యుల హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్న పార్లమెంటరీ సంప్రదాయాలు, విధానాల గురించి మరోసారి తెలియజేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఎంపీలకు జారీ చేసిన సూచనల్లో పార్లమెంటరీ సంప్రదాయాలు, విధివిధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంపీలు అనవసర, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎంపీలు, ముఖ్యంగా ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో ఏదైనా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తేందుకు బహిరంగ నోటీసులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆపాలని కోరారు.
ముఖ్యమైన అంశాలు
* సభలో ధన్యవాదాలు, థ్యాంక్యూ, జై హింద్, వందేమాతరం వంటి నినాదాలు చేయకూడదు.
* సభాపతి పై సభ లోపలా, బయటా విమర్శలు చేయకూడదు.
* సభలో ప్లకార్డులు ఊపొద్దు.
* సభాపతి మాట్లాడుతున్నప్పుడు సభ్యులెవరూ సభ నుంచి బయటకు వెళ్లకూడదు.. చైర్మన్ మాట్లాడే సమయంలో సభలో మౌనం పాటించాలి.
* సభలో ఏ ఇద్దరు సభ్యులు కలిసి నిలబడకూడదు.
* సభ్యులు నేరుగా ఛైర్మన్‌ను సంప్రదించ లేకపోతే, వారు స్లిప్‌ను అటెండర్‌కు పంపవచ్చు.
* సభ్యులు వ్రాసిన ప్రసంగాలను చదవకూడదు.
* సభలో సభ్యుల హాజరు నమోదు తప్పనిసరి.
* ఒక ఎంపీ అనుమతి లేకుండా అరవై రోజులు గైర్హాజరైతే, అతని స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించవచ్చు.
* పార్లమెంట్ ఆవరణలో పొగతాగడంపై నిషేధం ఉంది.
* సభా కార్యక్రమాలను వీడియో తీయడం నిషేధించబడింది. ఏ ఎంపీ ఇలా చేయకూడదు.
* కొత్త సభ్యుని మొదటి ప్రసంగం 15 నిమిషాలకు మించకూడదు. ఎంచుకున్న టాపిక్కు దూరంగా ఉండకూడదు.