ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఉత్తరకాశీలోని టన్నెల్‌లో కార్మికులు చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే 86 మీటర్ల దిగువకు మరోసారి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించి కార్మికులను బయటకు తీసుకురానున్నారు. అందుకు మరికొంత సమయం పడుతుంది.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్-కోటాబాగ్ బ్లాక్‌లోని బఘని వంతెన సమీపంలో ఒక కారు లోతైన గుంటలో పడిపోయింది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆదిత్య ఎల్1 శాటిలైట్ ఆఖరి దశకు చేరుకుందని వెల్లడించారు.
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులకు ఢిల్లీ సాకేత్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 14 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పరిశీలించారు.
2024వ ఏడాదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సాధారణ సెలవులను ప్రకటించింది. మొత్తం 25 సాధారణ సెలవులను ఇస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. ఇక్కడ పూణెలోని వాన్‌వాడి ప్రాంతంలోని ఓ పోష్ సొసైటీలో భార్య తన భర్తను ముక్కుపై కొట్టి హత్య చేసింది. నిజానికి, తన పుట్టినరోజున తన భర్త తనను దుబాయ్‌కి తీసుకెళ్లాలని కోరింది.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌నుప్రధాని మోడీ సందర్శించారు. స్వదేశి టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో విహరించారు. మన దేశం ఎందులో తక్కువ కాదని గర్వంగా చెప్పగలనని తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం జనాభా గణన చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కుక్కల సంఖ్య ఆధారంగా జనాభా గణన జరగనుంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం వెల్లడించారు.
రాజస్థాన్ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహ్రీ జిల్లాలోని రన్‌హోలా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2పై బాంబులు వేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అలా చేయకుండా ఉండాలంటే ప్రతి ఫలంగా బిట్‌కాయిన్ రూపంలో ఒక మిలియన్ యుఎస్ డాలర్లు డిమాండ్ చేశారు.
ఉత్తరకాశీలోని టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పైప్ లైన్ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది మాక్‌డ్రిల్‌ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.