»Woman Punches Husband To Death For Not Taking Her To Dubai For Birthday Celebration
Pune : పుట్టిన రోజున పార్టీకి తీసుకెళ్ల లేదని భర్తను ముక్కు మీద గుద్ది చంపిన భార్య
మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. ఇక్కడ పూణెలోని వాన్వాడి ప్రాంతంలోని ఓ పోష్ సొసైటీలో భార్య తన భర్తను ముక్కుపై కొట్టి హత్య చేసింది. నిజానికి, తన పుట్టినరోజున తన భర్త తనను దుబాయ్‌కి తీసుకెళ్లాలని కోరింది.
Pune : మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. ఇక్కడ పూణెలోని వాన్వాడి ప్రాంతంలోని ఓ పోష్ సొసైటీలో భార్య తన భర్తను ముక్కుపై కొట్టి హత్య చేసింది. నిజానికి, తన పుట్టినరోజున తన భర్త తనను దుబాయ్‌కి తీసుకెళ్లాలని కోరింది. అయితే భర్త అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన భార్య భర్త ముఖంపై కొట్టింది. దీంతో భర్త ముక్కుకు గాయమై రక్తస్రావం మొదలైంది. అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు.. ఆ తరువాత అతడు మరణించాడు. ఈ ఘటన పూణెలోని ఓ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
పెళ్లి రోజున కూడా ఆ భర్త.. భార్యకు ఎటువంటి బహుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె అప్పటికే తన భర్త మీద కోపంతో ఉంది. అంతే కాకుండా బంధువుల బర్త్ డే పార్టీ కోసం ఢిల్లీ వెళ్లాలనుకున్నా.. అప్పుడు కూడా భర్త నిరాకరించాడు. దీని తర్వాత, ఆమె పుట్టినరోజు వచ్చినప్పుడు, ఆమె దుబాయ్ వెళ్లాలని భావించింది. అయితే ఆమె భర్త ఈసారి కూడా నిరాకరించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వార్షికోత్సవంలో తనకు ఖరీదైన బహుమతులు ఇవ్వలేదని, బంధువుల బర్త్ డే పార్టీకి తీసుకెళ్లలేదని భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె తన పుట్టినరోజున దుబాయ్ వెళ్లాలని గొడవ పడింది. సెలవుల్లో దుబాయ్ వెళ్లేందుకు భర్త నిరాకరించాడు. ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో ఆగ్రహించిన భార్య భర్త ముఖంపై కొట్టింది. పంచ్ ధాటికి భర్త పళ్లు, ముక్కు విరిగిపోయాయి. దీంతో అధిక రక్తస్రావం జరిగి 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతం ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.