»The Workers Will Come From The Tunnel In December Works With The Biggest Drilling Machine
Uttarakhand : టన్నెల్ నుంచి కార్మికులు వచ్చేది డిసెంబర్లోనే..అతిపెద్ద డ్రిల్లింగ్ మిషన్‌తో పనులు!
ఉత్తరకాశీలోని టన్నెల్లో కార్మికులు చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే 86 మీటర్ల దిగువకు మరోసారి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించి కార్మికులను బయటకు తీసుకురానున్నారు. అందుకు మరికొంత సమయం పడుతుంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని సిల్క్యారా టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించింది. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. గురువారం అమెరికన్ ఆగర్ యంత్రం మొరాయించడంతో ఎక్కడికక్కడ పనులను నిలిపివేశారు. అయితే శుక్రవారం డ్రిల్లింగ్ పనులు ప్రారంభించినా భారీ యంత్రం మెటల్ గిర్డర్‌ను తాకింది. దీంతో మెషీన్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆగర్ యంత్రం పనులను ఆపి ప్రత్యామ్నాయ మార్గలపై అధికారులు దృష్టి పెట్టారు.
Responding with alacrity to the requirements of the ongoing rescue operation, late last evening the IAF flew in critical DRDO equipment to Dehradun.#HADROpspic.twitter.com/LYGyzqbenE
ఇప్పుడు వారు ఆలోచిస్తున్నది రెండు విషయాలే. అందులో మొదటిది 10 మీటర్ల విస్తీర్ణంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుంటే 86 మీటర్ల దిగువకు మరోసారి డ్రిల్లింగ్ పనులను మొదలుపెట్టాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం కొండ పైనుంచి డ్రిల్లింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం రహదారిని సైతం మొదలుపెట్టారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు అయిన సయ్యద్ అలా హస్సైన్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేలా ఉందన్నారు. డిసెంబర్ చివరి నాటికి కార్మికులు టన్నెల్ నుంచి బయటకు వస్తారని పలువురు అంచనా వేయగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. శిథిలాల్లో ఇరుక్కున్న ఆగర్ బ్లేడ్లను కత్తించేందుకు ప్లాస్మా కట్టర్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఆ కటర్ను హైదరాబాద్ నుంచి విమాన మార్గంలో తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు. అది వచ్చాక మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.