»41 People In The Tunnel For 14 Days Mockdrill To Bring Out
Video Viral: 14 రోజులుగా టన్నెల్‌లోనే 41 మంది..బయటకు తీసుకొచ్చేందుకు మాక్‌డ్రిల్
ఉత్తరకాశీలోని టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పైప్ లైన్ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది మాక్‌డ్రిల్‌ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటన అందరికీ తెలిసిందే. అందులో 41 మంది చిక్కుకోవడంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. పెద్ద పైపు ద్వారా వీల్ చైర్‌ను లోపలికి పంపించి దాని సాయంతో బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మాక్‌డ్రిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతోన్న మాక్‌డ్రిల్ వీడియో:
NDRF demonstration of the trapped men will be brought out of the Silkyara tunnel in Uttarkashi. 41 tunnel workers have been trapped inside the tunnel since the past 13 days. #SilkyaraTunnelpic.twitter.com/Df4bLpvQqa
— Saurabh Sharma (TRAVEL. REPORT. REPEAT) (@saurabhsherry) November 24, 2023
టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న వేళ మరికొద్ది సేపట్లో ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కానుంది. నవంబర్ 12న కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోగా గత 14 రోజులుగా వారు టన్నెల్ లోపలే ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకూ రెస్క్యూ ఆపరేషన్ పనులు పూర్తయ్యాయి. అయితే మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రిల్లింగ్ పనులను ఆపేశారు. ఇప్పటి వరకూ అధికారులు సిల్క్యారా సొరంగంలో 46.8 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ పనులను చేపట్టారు.
అనుభవం ఉన్నవారిని పిలిచి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నాటికి కార్మికులను బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు సయ్యద్ హస్నైన్ వెల్లడించారు. టన్నెల్లో కొంతభాగం నవంబర్ 12న కూలిపోయింది. ఆ క్రమంలో 57 మీటర్ల మేర శిథిలాలు ఉన్నాయి. ఆగర్ యంత్రంతో ఇప్పటి వరకూ 46.5 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ నిర్వహించి శిథిలాలను తొలగించారు.
ఇంకా 9 మీటర్ల వరకూ శిథిలాలను తొలగించాల్సి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి..టన్నెల్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. కార్మికులకు అతి దగ్గరగా రెస్క్యూ టీమ్ చేరుకుందని పైప్ లైన్ ద్వారా వారికి కూడా సమాచారాన్ని అందించారు. టన్నెల్ నుంచి కార్మికులను రక్షించేందుకు మరో పథకాన్ని కూడా రెస్క్యూ సిబ్బంది సిద్దం చేశారు.