Plan To Control Delhi Pollution Kick In Day After Air Quality Turns Poor
Delhi Pollution: ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి వేగం తగ్గుముఖం పట్టడం, దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం పూర్ కేటగిరి నుండి సివియర్ కేటగిరికి చేరుకుంది. నేడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఢిల్లీలో సగటు గాలి నాణ్యత 388 పాయింట్లుగా నమోదైంది. ఆర్కే పురంలో 422, వాజీపూర్‌లో 443, అలీపూర్‌లో 432, ఆనంద్ విహార్‌లో 411 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో నమోదయ్యాయి. ఇది చాలా ప్రమాదకర స్థాయి అని అధికారులు చెబుతున్నారు.
గాలి నాణ్యత లోధి రోడ్లో 359 పాయింట్లు, గురుగ్రామ్‌లో 321 పాయింట్లు, నోయిడాలో 363 పాయింట్లుగా నమోదైంది. యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వస్తున్న వాహనాలు, పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దీంతో ఇటీవల దీపావళికి ఎన్ని ఆంక్షలు విధించినా అక్కడక్కడా ఏర్పడిన వాయుకాలుష్యంతో తీవ్రత పెరిగిందన్నారు. వాయుకాలుష్యంతో ప్రజలు కళ్లు మంట, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. వాహనాలపై రెడ్‌లైట్‌ను ఆఫ్ చేయడం, రోడ్లపై నీళ్లు చల్లడం, బయోమాస్‌ను కాల్చకుండా ఉండడం వంటి గ్రూప్ 3 కాలుష్య నియంత్రణ చర్యలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్ని ఆంక్షలు విధించినా.. కాలుష్య స్థాయి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.