»Uttarkashi Silkyara Tunnel Rescue Augur Machine Stuck Cm Pushkar Dhami Give Updates
Uttarkashi Tunnel: టన్నెల్లో ఇరుక్కుపోయిన అగర్ మెషిన్.. ఆలస్యమవుతున్న రెస్క్యూ పనులు
సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 14 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పరిశీలించారు.
Uttarkashi Tunnel: సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 14 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పరిశీలించారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. సవాళ్ల మధ్య రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ చివరి దశలో చిక్కుకుంది. ఇప్పటి వరకు మొత్తం 48 మీటర్ల డ్రిల్లింగ్ చేయగా 12 నుంచి 14 మీటర్ల డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా ఆగర్ మిషన్ బ్లేడ్లో ఇనుప వల చిక్కుకుంది.
ఇనుప వల ఇరుక్కుపోవడంతో ఆగర్ మిషన్ బ్లేడ్ విరిగి పైపులోపలికి కూరుకుపోయిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి తెలిపారు. ఇప్పుడు ప్లాస్మా కట్టర్‌తో కోసి బయటకు తీస్తున్నారు. బ్లేడ్‌లోని దాదాపు 23 మీటర్ల భాగాన్ని బయటకు తీయగా, 25 మీటర్ల భాగం ఇంకా లోపల ఇరుక్కుపోయింది. రేపు ఉదయానికి ఆగర్ మెషిన్ పూర్తిగా బయటకు వస్తుంది. దీని తర్వాత మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది. ‘సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో నేను మాట్లాడాను, వారు మానసికంగా దృఢంగా, ఫిట్‌గా ఉన్నారు’ అని అన్నారు. తమకు ఆహారం అందుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్మికులు తనకు చెప్పినట్లు సీఎం తెలిపారు. వీలైనంత త్వరగా వాళ్లను టన్నెల్ నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడకు ప్లాస్మా కట్టర్ వంటి పరికరాలు తెప్పిస్తున్నారు.