ఉత్తరాఖండ్(Uttarakhand)లోని గౌరీకుండ్ సమీపంలో దాట్పులియా ఆకస్మిక వరద వచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చేందాగా మంది గల్లంతయ్యారు.మూడు షాపులు వరద దాటికి నీటిలో కొట్టుకు పోయాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy rains)కు వర్షధార జలపాతమార్గంలో పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహించడంతో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం అత్యవసర విపత్తు దళాలు గాలిస్తున్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి (CM Pushkar Singh Dhami) సెక్రటేరియేట్‌లోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌కు చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కొరారు.
నదీ ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. అవసరమైతే వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేదార్నాథ్ యాత్ర(Kedarnath Yatra)ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు (Officers) వెల్లడించారు. ఇప్పటికే ఆ మార్గంలో వెళ్తున్న వారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ సంఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కేదార్‌నాథ్‌కు ప్రయాణాల్ని ఆపేయాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు.