వచ్చే ఏడాది 2024లో ప్రభుత్వం ఇచ్చే సాధారణ సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే సెలవుల్లో అత్యధికంగా జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లోనే ఉండటం విశేషం. అందులో కూడా జనవరిలో 5 సెలవులు ఉన్నాయి. ఇక ఏప్రిల్ ఐదు, అక్టోబర్ నెలల్లో ఆరు సెలవులు ఉన్నట్లు సర్కార్ తెలిపింది. ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్క సాధారణ కూడా సెలవు కూడా లేదని తెలిపింది. ఏడాది మొత్తంగా చూస్తే 25 సాధారణ సెలవులను ప్రభుత్వం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వర్తిస్తాయని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆ సాధారణ సెలవులు ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రభుత్వం అందించే సాధారణ సెలవులు ఇవే: జనవరి 1వ తేది సోమవారం- నూతన సంవత్సరం జనవరి 14వ తేది ఆదివారం- బోగి జనవరి 15వ తేది సోమవారం- సంక్రాంతి జనవరి 16వ తేది మంగళవారం- కనుమ జనవరి 26వ తేది శుక్రవారం- రిపబ్లిక్ డే
మార్చి 8వ తేది శుక్రవారం- మహాశివరాత్రి మార్చి 29వ తేది శుక్రవారం- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5వ తేది శుక్రవారం- బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 9వ తేది మంగళవారం- ఉగాది ఏప్రిల్ 10వ తేది బుధవారం- రంజాన్ ఏప్రిల్ 14వ తేది ఆదివారం- బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 17వ తేది బుధవారం- శ్రీరామనవమి
జూన్ 17వ తేది సోమవారం- బక్రీద్ జూలై 17వ తేది బుధవారం- మొహర్రం
ఆగస్టు 15వ తేది గురువారం- స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 26వ తేది సోమవారం- శ్రీ కృష్ణఅష్టమి
సెప్టెంబర్ 7వ తేది శనివారం- వినాయకచవితి సెప్టెంబర్ 16వ తేది సోమవారం- ఈద్ మిలాదున్ నబీ
అక్టోబర్ 2వ తేది బుధవారం- మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 11వ తేది శుక్రవారం- దుర్గాష్టమి అక్టోబర్ 12వ తేది శనివారం- మహర్ నవమి అక్టోబర్ 13వ తేది ఆదివారం- విజయదశమి అక్టోబర్ 30వ తేది బుధవారం- నరకచతుర్ధశి అక్టోబర్ 31వ తేది గురువారం- దీపావళి