ఉత్తరకాశీ సొరంగం ప్రమాదం జరిగి నేటికి 13 రోజులు. ఇప్పటి వరకు సొరంగం నుంచి కార్మికులు బయటకు రాలేకపోయారు. రెస్క్యూ టీమ్ వేగంగా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది.
మీరాబాయి 525 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్స్, 525 రూపాయల నాణేలను విడుదల చేశారు. సెయింట్ మీరాబాయి మహిళా శక్తిని బలోపేతం చేశారని ఈ సందర్భంగా ప్రదాని మోదీ కొనియాడారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి వేగం తగ్గుముఖం పట్టడం, దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నల్ లోపంతో మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలు తప్పాయి.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి మంగళవారం ఒక ఉపాధ్యాయుడు గుంజీలు చేయమని బలవంతం చేయడంతో క్లాసు రూంలోనే కుప్పకూలాడు.
డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఈ మధ్య తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ కేసుల పట్ల ప్రభుత్వం జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తమ వంతుగా నేటితో చివరి ప్రయత్నం చేయనున్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా సహా కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.
తమిళనాడులో మరో కొత్త రకం వైరస్ విజృంభించడం వల్ల ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ తరుణంలో మాస్క్ లేకుండా బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
మరి కాసేపు వెయిట్ చేయండి.. దేశం మొత్తం టన్నెల్లో చిక్కుకున్న 41మంది బాధితులు బయటకు రానున్నరు. ఈ విషయం మేం చెప్పడం లేదు, సొరంగం దగ్గర ఉన్న తీవ్రమైన కదలిక నుండి ఇది ఊహించబడింది. సొరంగం దగ్గర అధికారుల కదలికలు తీవ్రరూపం దాల్చాయి.
గూగుల్ పే యాప్ వాడేవారికి ఆ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ పే నుంచి ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో థర్టీ పార్టీ యాప్‌లు లేదా స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వినియోగించొద్దని హెచ్చరించింది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో దాడులు చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.
కుల గణన, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ ప్రతిపాదనకు నితీశ్ కుమార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అటువంటి టెక్నాలజీ రావడం వల్ల భవిష్యత్తులో ఫేక్ సమాచారం వ్యాపించే అవకాశం ఉందని, దాని వల్ల అమాయకులు బలైపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కేంద్ర సహాయ మంత్రి కీలక ప్రకటన చేశారు. అవసరమైతే డీప్‌ఫేక్ విధానాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.