»Cm Nitish Kumar Cabinet Approve Bihar Special Status Draft
Bihar: నితీష్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీహార్‌కు ప్రత్యేక హోదాకు కేబినెట్ ఆమోదం
కుల గణన, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ ప్రతిపాదనకు నితీశ్ కుమార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Bihar: కుల గణన, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ ప్రతిపాదనకు నితీశ్ కుమార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నితీష్ కుమార్ స్వయంగా సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకున్నారు. ఈ డిమాండ్‌ను వీలైనంత త్వరగా నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయాన్ని నితీష్ కుమార్ ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్‌లో ప్రకటించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనకు ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని ఆయన తన పోస్ట్‌లో రాశారు. బీహార్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఆయన రాశారు.
నితీష్ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లను 75 శాతానికి పెంచింది. కుల ప్రాతిపదికన జనాభా గణనలో అన్ని తరగతులతో కలిపి బీహార్‌లో దాదాపు 94 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయని, ఆ కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఉపాధి కోసం రూ.2 లక్షల వరకు ఇవ్వనున్నట్లు నితీష్ కుమార్ తన పోస్ట్‌లో తెలియజేశారు. అలాగే భూమిలేని 63,850 కుటుంబాలకు రూ.60 వేల పరిమితిని రూ.లక్షకు పెంచారు. ఈ కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు రూ. లక్షా 20 వేలు ఇస్తారు. ఈ పథకాలను పూర్తి చేసేందుకు దాదాపు రూ. 2 లక్షల 50 వేల కోట్లు ఖర్చవుతుందని, అందుకే బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని నితీశ్ కుమార్ అన్నారు.