Rajouri Encounter: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఇద్దరు ఉగ్రవాదులు ఘటనా స్థలంలో చిక్కుకోవడంతో రాజౌరిలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత, ధర్మాల్లోని బాజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు – ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఉమ్మడి దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక అధికారి, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ అడవులు గత కొన్నేళ్లుగా అనేక ఎన్కౌంటర్ల తర్వాత భద్రతా దళాలకు సవాలుగా మారాయి. ఉగ్రవాదులు భౌగోళిక ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తమ స్థానాలను దాచడానికి దట్టమైన అడవులను ఉపయోగిస్తారు. ఉగ్రవాదులు తమ స్థానాలను దాచుకోవడానికి పర్వతాలు, దట్టమైన అడవులు,ఆల్పైన్ అడవులను సద్వినియోగం చేసుకుంటారు.