»Campaigning Will Be Suspended From November 23rd Evening Rajasthan Elections On 25th November
Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్.. షోకాజ్ నోటీసులు జారీ
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది.
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందులకు, జేబుదొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. నవంబర్ 25 సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని సూచించారు.
కాగా, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియాపై భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత నవంబర్ 21న రాజస్థాన్‌లోని బలోత్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై పనోటీ అనే పదాన్ని ఉపయోగించారు. మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ ఓటమికి ఓ అపశకునమే కారణమని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదు చేశాయి.