»Actor Prakash Raj Summoned By Enforcement Directorate In Ponzi Scheme Probe
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు సమన్లు జారీ చేసిన ఈడీ
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధనల ప్రకారం తిరుచిరాపల్లిలోని ప్రణవ్ జ్యువెలర్స్ భాగస్వామ్యానికి చెందిన ఆస్తులపై దర్యాప్తు సంస్థ నవంబర్ 20న సోదాలు నిర్వహించిన తర్వాత సమన్లు వచ్చాయి. ప్రణవ్ జువెలర్స్ ద్వారా బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌పై విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రకాష్ రాజ్ ప్రణవ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్. వచ్చే వారం చెన్నైలోని ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 11.60 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 23.70 లక్షల విలువైన పలు నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రణవ్ జువెలర్స్ నిర్వహిస్తున్న పోంజీ పథకం ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రణవ్ జ్యువెలర్స్ రూ. 100 కోట్లు వసూలు చేసింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైంది. పెట్టుబడిదారులను మోసం చేశారు.